|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 07:19 PM
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కూరెళ్ల గ్రామానికి చెందిన సుమారు 50 మంది టీఆర్ఎస్,బీజేపీ నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలికిన ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు.ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆకర్షితులై నేతలు,కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనం.కూరెళ్ల గ్రామంలో ఉన్న అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని ఆత్మకూరు మండలంలో కూరెళ్లను నెంబర్ వన్ గ్రామంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నాను అని తెలిపారు.