|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 11:19 PM
కేసీఆర్ తన పేరు తీసుకోలేదని రేవంత్ రెడ్డి అలిగి రాత్రి అన్నం తినకుండానే పడుకున్నాడని BRS MLC దాసోజు శ్రవణ్ విమర్శించారు. రానున్న మూడున్నరేళ్లలో BRS మీ భరతం పడుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు కేసీఆర్పై విమర్శ చేసే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. '6 గ్యారంటీలను 100 రోజులలో పూర్తి చేస్తామని చెప్పిన సీఎం, మంత్రులు అంబేద్కర్ విగ్రహం దగ్గర చంపలేకుంటారా? ఒక్క గ్యారెంటీ అయినా రాష్ట్రంలో అమలు చేస్తున్నారా?' అని ప్రశ్నించారు.