|
|
by Suryaa Desk | Thu, May 01, 2025, 07:30 PM
హైదరాబాద్ నగర ప్రజలకు వేగవంతమైన రవాణా సౌకర్యాన్ని అందిస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు సేవలకు అంతరాయం కలిగింది. అత్యంత రద్దీగా ఉండే మియాపూర్ - ఎల్బీనగర్ కారిడార్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఒక మెట్రో రైలు మార్గమధ్యంలో నిలిచిపోయింది. ఈ సంఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వైపు వెళుతున్న మెట్రో రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీని కారణంగా రైలు భరత్ నగర్ స్టేషన్ సమీపంలో సుమారు 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. రైలు ఆగిపోవడంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు కొంత ఆందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే హైదరాబాద్ మెట్రో రైల్ సాంకేతిక సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతు చర్యలు చేపట్టారు. దాదాపు 20 నిమిషాల పాటు శ్రమించి సాంకేతిక సమస్యను పరిష్కరించారు. అనంతరం రైలు యధావిధిగా బయలుదేరి వెళ్ళింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.