|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 01:40 PM
రుద్రూర్, మే 02, 2025: పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులను రైడ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం సన్మానించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత (బాలుర) పాఠశాల విద్యార్థిని అమూల్య, ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని రేష్మ మహిన్‌లు ఈ సన్మానానికి అర్హులయ్యారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు బద్దం సంజీవరెడ్డి, రైడ్స్ అధ్యక్షులు కర్రోళ్ళ కృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పార్వతీ శేఖర్ తదితరులు పాల్గొని విద్యార్థినులను అభినందించారు.