|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 01:43 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే, విద్యార్థినులు మరియు మహిళలు వేధింపులకు గురైనప్పుడు భయపడకుండా నిర్భయంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.
జిల్లాలో షీ టీమ్ బృందం కళాశాలలు, పాఠశాలలు, గ్రామాలు మరియు పని ప్రదేశాల్లో విద్యార్థినులకు, మహిళలకు ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, పోక్సో చట్టం, షీ టీమ్స్ మరియు మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తోందని ఎస్పీ తెలిపారు. ఎలాంటి సమస్య ఉన్నా పోలీసులను సంప్రదించాలని ఆయన పిలుపునిచ్చారు.