|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 02:13 PM
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు ప్రతి ఒక్క ఆదివాసి బిడ్డ ఉద్యమం చేయాలని తుడుం దెబ్బ నాయకుడు కల్తీ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఇల్లందులో జరిగిన సమావేశంలో మాట్లాడారు. మే 18న భారీ బహిరంగ సభ ఇల్లందులో నిర్వహించడానికి తీర్మానం చేశారన్నారు. ఉద్యమం చేయడానికి కలిసివచ్చే ప్రతి సంఘంతో మమేకమై పనిచేయాలని సూచించారు. ఆదివాసి జాతిపై ముప్పు పొంచి ఉందని ప్రతి ఒక్క మేధావి వర్గం గమనించాలన్నారు.