|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 02:07 PM
దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కుల గణన చేపట్టాలని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం చాలా సంతోషంగా ఉందని జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు పిట్టల యాదయ్య కొనియాడారు. అలాగే జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో శుక్రవారం మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధికార ప్రతినిధి కుర్వ రాములు, బీజేపీ పార్టీ వైస్ ప్రసిడెంట్ కృష్ణవర్దన్ రెడ్డి, పాండురంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.