|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 02:04 PM
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో శుక్రవారం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రాకేశ్, రవళి దంపతుల 11 నెలల కుమారుడు ఆర్యన్ నీటి సంపులో పడి మృతి చెందాడు.
పని నిమిత్తం రాకేశ్ బయటకు వెళ్లగా, తల్లి రవళి ఇంటి పనిలో మునిగిపోయింది. ఈ సమయంలో ఆడుకుంటున్న ఆర్యన్ ఇంటి సమీపంలోని నీటి సంపులో పడిపోయాడు. ఊపిరాడక చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.