|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 01:59 PM
పెద్దేముల్ మండలం గోపాల్పూర్ గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి, ఇందూర్ సోలార్ పవర్ ప్లాంట్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి నైట్ డ్యూటీ కోసం యథావిధిగా ప్లాంట్‌కు వెళ్లిన అతడు, శుక్రవారం తెల్లవారుజామున పవర్ ప్లాంట్‌లో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు.
రాజశేఖర్ రెడ్డి మృతి అనుమానాస్పదంగా ఉందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.