|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 02:31 PM
సంగారెడ్డి పట్టణంలో శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ విద్యార్చన వేడుకలు ఘనంగా జరిగాయి. సులోచన పూర్ణచందర్ దంపతుల నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
విద్యాపీఠం పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు శివ పంచాక్షరి నామాన్ని భక్తిశ్రద్ధలతో జపించారు.