|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 02:39 PM
సదాశివపేట, మే 02, 2025: తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సత్తయ్య గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం సదాశివపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా డీఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మేంద్ర అనే వ్యక్తి తన బీరువా దుకాణంలో అదే రాష్ట్రానికి చెందిన ఒక పంతులతో శాంతి పూజ చేయించాడు. అయితే, కొందరు దీన్ని క్షేత్ర పూజలుగా తప్పుగా ప్రచారం చేశారని ఆయన తెలిపారు. తప్పుడు ప్రచారాలు చేసే వారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు.