|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 02:43 PM
సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు నియోజకవర్గం, గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని నల్లవల్లి గ్రామంలోని ప్యారా నగర్ వద్ద డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా గ్రామస్తులు శుక్రవారం ఆందోళనకు దిగారు. డంపింగ్ యార్డ్ రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు రిలే నిరసన దీక్షలు చేపట్టారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు. డంపింగ్ యార్డ్ వల్ల పరిసర ప్రాంతాలకు పర్యావరణ, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు.