|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 02:51 PM
నడిగూడెం మండలం, శుక్రవారం: నేల ఆరోగ్యమే పంట ఆరోగ్యానికి మూలమని ప్రకృతి వ్యవసాయ ప్రచారకులు మొలుగురి గోపయ్య అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో భూసార పరీక్షలపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
గోపయ్య, రైతులకు స్వచ్ఛందంగా మట్టి పరీక్షలు నిర్వహించి సాయిల్ హెల్త్ కార్డ్ అందజేస్తానని తెలిపారు. భవిష్యత్ తరాల ఆరోగ్యం కోసం ప్రతి రైతు కనీసం అర ఎకరంలోనైనా సేంద్రియ వ్యవసాయం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.