|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 03:06 PM
జగిత్యాల జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన రూ. 20 లక్షల విలువ గల 102 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సీఐఈఆర్ యాప్ ద్వారా ట్రేస్ ఔట్ చేసి బాధితులకు శుక్రవారం డీపీవో కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఇది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ కోర్ ఇన్ స్పెక్టర్ రఫీక్ ఖాన్ పాల్గొన్నారు.