|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 04:48 PM
కాగజ్‌నగర్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరుగుతున్న శ్రీమద్దేవీ భాగవతం శుక్రవారం 8వ రోజుకు చేరుకుంది. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు శ్రీమద్దేవీ భాగవతానికి హాజరై గురువులు బుర్ర భాస్కర శర్మచే ఆశీర్వచనాలు పొందారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేను వైశ్య సంఘం అధ్యక్షులు కేశెట్టి శంకరయ్య, చిలువేరి సత్యనారాయణ, చిలువేరు గంగాధర్, గనపురం ప్రకాష్ కే. సత్యనారాయణ ఘనంగా స్వాగతం పలికారు.