|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 06:47 PM
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుండి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి స్థలం 600 గజాలకు మించకూడదని, 400 గజాలకు తగ్గకూడదని చెప్పారు. పథకానికి నిజమైన అర్హులను ఎంపిక చేయాలని సూచించారు.