|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 06:55 PM
నారాయణపేట శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని శుక్రవారం ఉడిపి అదమురు మఠాధిపతి విశ్వప్రియతీర్థులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన స్వామీజీకి విద్వాన్ అనిల్ దేశాయి, ఆలయ అర్చకులు నరసింహచారి, శేషు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, మంగళహారతులు సమర్పించారు. భక్తులనుద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. కార్యక్రమంలో రాఘవేంద్ర సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.