|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 06:53 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు బిగ్ షాక్. ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత . ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ప్రభాకర్‌రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు.ఈ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ ప్రధాన నిందితుడు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే ఆయన అమెరికా పారిపోయాడు. ప్రస్తుతం అమెరికాలోనే ఉన్న ప్రభాకర్ రావు.. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని.. బెయిల్ ఇస్తే కేసు విచారణకు సహకరిస్తానని తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఇరువర్గాల వాదనలు విన్నది. ఈ కేసులో ప్రభాకర్ కీలక నిందితుడు అని.. అతడికి ముందస్తు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తాడని.. అతడి బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు.