|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 06:50 PM
పదేళ్ల బీఆర్ఎస్ పాలన, మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. శుక్రవారం మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్ లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రెవెన్యూ వ్యవస్థను తన దగ్గర పెట్టుకొని కేసీఆర్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. KCR పాలనలో మంత్రులకు పవర్ లేదు.. స్వేచ్ఛగా రివ్యూ చేసుకునే పరిస్థితి ఉండేది కాదని అన్నారు. పదేళ్ల పాటు ఒక్క మంత్రిని కూడా సరిగా పనిచేయనీయలేదని అన్నారు.మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల దృష్ట్యా చలివేంద్రాలలో త్రాగునీరుతోపాటు ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్ల సరఫరా చేయాలని నిర్ణయించాం. సి ఎస్ ఆర్ కింద వివిధ కంపెనీలు వీటిని సరఫరా చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌తో పాటు వరంగల్, ఖమ్మం,మహబూబ్‌నగర్, నిజామాబాద్, కొత్తగూడెం, మెదక్, కరీంనగర్ పట్టణ ప్రాంతాల్లో ఫోకస్ చేయాలని ఆయన సూచించారు.