|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 01:19 PM
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం పలు వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. పాలమూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వడగళ్ల వానకు నష్ట పోయిన వరికి ఎకరాకు రూ. 40 వేల నష్టపరిహారం ఇవ్వాలన్నారు.
బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్ గౌడ్, మాజీ జడ్పీటీసీ నరేందర్, సీనియర్ నాయకులు వెంకటయ్య, కొండాలక్ష్మయ్య, శ్రీనివాసులు, అనంతరెడ్డి పాల్గొన్నారు.