|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 01:18 PM
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ప్రగటూరులో నిప్పు అంటుకుని గడ్డివాములు కాలిపోయిన సంగతి విధితమే. ఈ మేరకు శుక్రవారం మండల తహశీల్దార్ ప్రభాకర్ కలిసి విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో 18 గడ్డివాములు, 800 పీవీసీ పైపులు, 3 ఎడ్ల బండ్లు కాలి బూడిదయ్యాయి.
ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అధికారులు బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్, సీనియర్ నాయకులు రమణ తదితరులు పాల్గొన్నారు.