|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 01:35 PM
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని హస్గుల్, కద్గావ్, సెట్లుర్, పుల్కల్ గ్రామాల నుండి రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సుమారు పది ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసి కేసు నమోదు చేశామని బిచ్కుంద పోలీసులు శనివారం తెలిపారు. అక్రమంగా ఇసుక ఎవరు రవాణా చేసిన ఊరుకునే ప్రసక్తే లేదని బిచ్కుంద పోలీసులు హెచ్చరించారు.