|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 01:49 PM
కర్రెగుట్టలో కూంబింగ్ నిర్వహిస్తున్న జవాన్లు ఎండలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మండుటెండల్లో నిరంతరం డ్యూటీలో ఉండడంతో డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు. అయితే తాజాగా ఓ సీఆర్పీఎఫ్ జవాన్ గుండెపోటుకు గురయ్యాడు. అప్రమత్తమైన అధికారులు ఆయనను వెంకటాపూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే వంద మంది వరకు జవాన్లు వడదెబ్బకు గురైనట్లు సమాచారం.