|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 02:54 PM
శేరిలింగం పల్లి జోన్ మల్కం చెరువు, గచ్చిబౌలి నుండి కొండాపూర్ వరకు చేపట్టిన రెండో దశ శిల్పా లే ఔట్ ఫ్లై ఓవర్ పనులను పరిశీలించిన కమిషనర్ ఆర్ వి కర్ణన్.హెచ్ సిటి ప్రాజెక్ట్ ద్వారా ఖజాగూడ చౌరస్తా వద్ద చేపట్టనున్న ఫ్లై ఓవర్ అండర్ పాస్ స్తల పరిశీలన చేసిన కమిషనర్మల్కం చెరువు లో శానిటేషన్, కుక్కల బెడద, పై కమిషనర్ కు పిర్యాదు చేసిన వాకర్స్ . వాకర్స్ ఇబ్బంది లేకుండా నిర్వాహకులు తో మాట్లాడి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించిన కమిషనర్.చెరువు లో స్టార్మ్ డ్రైన్ వాటర్ ఎక్కడ నుండి వస్తుందని అధికారులను అడిగిన కమిషనర్దుర్గం చెరువు నుండి, ఇళ్లనుండి స్టార్మ్ వాటర్ వస్తున్నట్లు కమిషనర్ కు వివరించిన అధికారులు.స్టార్మ్ వాటర్ చెరువులో రాకుండా ప చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు.శిల్పా లే ఔట్ రెండో ఫేస్ ఫ్లై ఓవర్ పనులను పరిశీలించిన కమిషనర్. ఫ్లై ఓవర్ పనులను ఈ నెల చివరికి పూర్తిచేయాలని ఆదేశించిన కమిషనర్భూసేకరణ పూర్తిచేస్తే సర్వీస్ రోడ్డు కూడా పూర్తవుతుందని కమిషనర్ ను తెలిపిన ప్రాజెక్టు ఇంజనీర్లు.భూసేకరణ పక్రియ పూర్తికి చర్యలు తీసుకోవాలని జోనల్ కమీషనర్ కు ఆదేశాలు.కమిషనర్ వెంట జోనల్ కమీషనర్ బి హేమంత్ సహదేవ్ రావు, డి సి ప్రశాంతి యస్ ఈ బాలాజీ, ప్రాజెక్టు ఈ ఈ నమ్యనాయకి, డి ఈ ఈ హరీష్ యు బి డీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.ఫ్లై ఓవర్ పైన చేపట్టే పనులను నడిచి వెళ్లి పరిశీలించిన కమిషనర్.