|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 03:48 PM
పరీక్ష రాసి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. అక్కాచెల్లెళ్లు దుర్మరణం. కూతుళ్ళ కడసారి చూపులకు నోచుకోకుండా మలేషియాలో చిక్కుకుపోయిన తండ్రి రెడ్డి నాయక్ . స్పందించి రెడ్డి నాయక్‌తో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్.. స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు
రెడ్డి నాయక్ కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియలకు హాజరైన ఖానాపూర్ బీఆర్ఎస్ ఇంచార్జ్ జాన్సన్ నాయక్ . నిర్మల్ జిల్లా పెంబి మండలం లోతర్య తండాకు చెందిన బాణావత్ సుగుణ, రెడ్డి నాయక్‌ల కూతురు మంజుల(17), హైదరాబాద్‌లో F-SET ప్రవేశ పరీక్ష రాసేందుకు అక్క అశ్విని(19)తో కలిసి వెళ్ళింది. పరీక్ష అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా, వీరు ప్రయాణిస్తున్న కారు కల్వర్టును ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందార . వీరి తండ్రి రెడ్డి నాయక్ మూడేళ్ళ క్రితం మలేషియాలో పని చేయడానికి వెళ్ళగా, అక్కడ కంపెనీ మోసం చేయడంతో కూలి పని చేస్తున్నాడు . కూతుళ్ళ మరణవార్త విన్న రెడ్డి నాయక్ ఇంటికి తిరిగి వచ్చేందుకు ఆర్థిక స్తోమత లేదని విలపించాడు . దీనిపై స్పందించిన కేటీఆర్, రెడ్డి నాయక్‌తో ఫోన్లో మాట్లాడగా కూతుళ్లను కడసారి చూడలేకపోతున్నానని కన్నీళ్ళు పెట్టుకున్నాడు . దీంతో రెడ్డి నాయక్‌ని ఇంటికి తీసుకొచ్చేందుకు కేటీఆర్ టీం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు