|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 04:06 PM
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో కోరారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా జిల్లాలో ఎవరు వడదెబ్బకు గురికాకుండా వైద్యారోగ్య శాఖతో పాటు, ఇతర శాఖల అధికారులు వడదెబ్బ నివారణపై వారి వారి ప్రణాళికకు అనుగుణంగా వేసవి తీవ్రత సమయంలో చేయదగినవి, చేయకూడని వాటి గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు.