|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 04:07 PM
ఇటీవల గ్రేటర్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న ఆర్వీ కర్ణన్ సిబ్బంది పని తీరుపై దృష్టి సారించారు. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికుల పని విధానాన్ని పరిశీలించారు. శనివారం ఖైరతాబాద్ మహా గణేష్ విగ్రహం వద్ద శానిటేషన్ సిబ్బందితో మాట్లాడి పని తీరును సమీక్షించారు. అక్కడ పని చేస్తున్న కార్మికుల అటెండెన్స్ ను పరిశీలించారు. గైర్హాజరు అయిన వారి గురించి ఆరా తీశారు. అనంతరం స్థానికులతో మాట్లాడారు.