|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 04:14 PM
అభివృద్ధిలో భాగంగా షాద్‌నగర్ మున్సిపల్ పరిధిలోని 22వ వార్డు భగత్ సింగ్ కాలనీలో తులసి రామ్ ఇంటి నుండి రమేష్ ఇంటి వరకు సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శుక్రవారం శంకుస్థాపన చేసిన సందర్భంగా అధికారులు సీసీ రోడ్డు పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్ల నాణ్యతను పరిశీలిస్తున్న మాజీ కౌన్సిలర్ నడి కూడ సరిత యాదగిరి యాదవ్, కాలనీవాసులు సంతృప్తి వ్యక్తం చేశారు.