|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 04:17 PM
మహబూబ్‌నగర్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ డీకే అరుణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్ష మేరకు బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన తప్పుడు కులగణన అని విమర్శించారు. కేవలం ఎన్నికల కోసమే కులగణన అనే మాట మాట్లాడారని చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయిందని ఎంపీ డీకే అరుణ విమర్శించారు.మొట్టమొదటి కులగణన 1931లో జరిగిందని ఎంపీ డీకే అరుణ గుర్తుచేశారు. ముస్లింలని బీసీ జాబితాలో చేర్చడం అంటే నిజమైన బీసీలను మోసం చేయడమేనని అన్నారు. 2026లో డీ లిమిటెషన్‌కి వెళ్తున్నామని అన్నారు. బీసీలు, ఓసీలకు నిజమైన న్యాయం చేసేది కేవలం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాత్రమేనని చెప్పారు. జనగణనతో పాటు కులగణన చేయడం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒక గొప్ప సంకల్పమని అన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేలతో పాటుగా ఎంపీలకు కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో కోటాను కల్పించాలని.. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాస్తానని ఎంపీ డీకే అరుణ వెల్లడించారు.