|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 07:55 PM
హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్నం వరకు ఉండ తీవ్రంగా ఉండగా... సాయంత్రానికి చల్లబడింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. చర్లపల్లి, ఉప్పల్, కుషాయిగూడ, ఎల్బీనగర్ సహా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి.ఈరోజు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, రంగారెడ్డి, సిరిసిల్లలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.