|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 08:37 PM
ఈనెల 20న జరిగే జాతీయ సమ్మెలో పాల్గొంటామని శనివారం ఆశ కార్యకర్తలు నారాయణపేట జిల్లా వైద్య శాఖ అధికారి జయ చంద్రమోహన్ కు సమ్మె నోటీసు అందించినట్లు యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాలమణి సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకట్రామిరెడ్డి, బలరాం తెలిపారు.
కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు కోడ్ లుగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. దీనిని అడ్డుకుంటామని చెప్పారు.