|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 08:32 PM
మరికల్ మండల కేంద్రంలో అక్రమంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బలరాం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు శనివారం నారాయణపేట కలెక్టరేట్ లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు ఫిర్యాదు చేశారు. బట్టిలో పని చేందుకు ఇతర రాష్ట్రాల నుండి కార్మికులను దిగుమతి చేసుకుంటున్నారని, వారికి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని అన్నారు.