|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 08:43 PM
వంగూరు మండలం, గాజర జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులను శనివారం సన్మానించారు.
తెలంగాణ బిసి మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్ యాదవ్ విద్యార్థులను అభినందించి, ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు ఏకాగ్రతతో చదివితేనే తమ లక్ష్యాలను సాధించగలరని సూచించారు.