|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 08:57 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించనుందని, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు తమ తమ ప్రాంతాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని డీజీపీ జితేందర్ అన్నారు. ‘అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసులు తమ శక్తి సామర్థ్యాలను చాటుకునే అవకాశం వచ్చింది. దేశంలోనే ఉత్తమ పోలీస్ శాఖగా ఎంపికైన తెలంగాణలో పనిచేస్తున్న సిబ్బంది ఆ స్థాయిని నిలుపుకోవాలి’ అని డీజీపీ సూచించారు.అందుకు అనుగుణంగా కృషి చేయాలి. పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావడంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ల పాత్ర ఎంతో కీలకం. దేశంలోనే ఉత్తమ పోలీస్ శాఖగా ఎంపికైన తెలంగాణలో పనిచేస్తున్న సిబ్బంది ఆ స్థాయిని నిలుపుకోవాలి. సాధించింది కొంత మాత్రమే.. చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది అనేలా పోలీసులు పనిచేయాలి’’ అని డీజీపీ సూచించారు.