|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 08:59 PM
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. వరంగల్ జిల్లాలో నీటిపారుదల, పౌర సరఫరా, రెవెన్యూ శాఖలపై మంత్రులు ఉత్తమ్, పొంగులేటి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. దొడ్డు రకాలకు మద్దతు ధర, సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు. దేవాదులను రెండేళ్లలో పూర్తి చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వానికి దేవాదుల ప్రతిష్టాత్మకమని చెప్పారు.