|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 09:04 PM
హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. శనివారం (మే3) సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురిసింది.ఉప్పల్, చిలుకానగర్, కంటోన్మెంట్, బోడుప్పల్, మేడిపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.సికింద్రాబాద్, బేగంపేట పరిసర ప్రాంతాల్లో కుండపోతగా కురిసింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.మరోవైపు వాతావరణ శాఖ అంచనావేసినట్లుగానే తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షం కురిసింది. కుమ్రం భీం జిల్లా కౌటాల మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన వడగంగడ్ల వాన కురిసింది.మరో రెండు గంటల్లో యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.