|
|
by Suryaa Desk | Sun, May 04, 2025, 12:46 PM
ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ. సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యంపైనే ఆర్టీసీ నడుస్తోందన్నారు. 5, 6 తేదీల్లో ఎప్పుడు వచ్చినా సమస్యలపై చర్చిస్తామని స్పష్టం చేశారు. పదేళ్లుగా ఆర్టీసీ నిర్వీర్యమైందని, సంస్థ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా ముందకెళ్తోందన్నారు. ఇబ్బందికర పరిస్థితులు తేవొద్దని సూచించారు.ప్రయాణికుల సౌకర్యార్థం ప్రజా పాలన పని చేస్తుందని మంత్రి పొన్నం వివరించారు. గత పదేళ్లుగా ఆర్టీసీ వ్యవస్థ నిర్వీర్యం అయిందన్నారు. నేడు ఆర్టీసీ పూర్తిగా లాభాల దిశలో పోతుందన్నారు. పాత అప్పులు పాత సీసీఎస్ నిధులు లాంటివి ఇచ్చే ప్రయత్నం జరుగుతుందన్నారు. అనంతరం హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి బస్‌స్టేషన్ వద్ద అంబేద్కర్ జంక్షన్ సుందరీకరణ పనులను మంత్రి పరిశీలించారు.ఎల్కతుర్తి బస్ స్టేషన్‌లో ఇటీవల ప్రారంభించిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లను పరిశీలించి కార్యకర్తలు, అధికారులతో కలిసి అల్పాహారం తిన్నారు. అలాగే ఎల్కతుర్తి లో పెండింగ్ పనులపై అధికారులతో ఆరా తీశారు.