|
|
by Suryaa Desk | Sun, May 04, 2025, 12:53 PM
తెలంగాణ రాష్ట్రంలో పగలు ఎండలు దంచికొడుతుండగా, సాయంత్రానికి వాతావరణం చల్లబడి కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడమైనది. వర్షాలతో పాటు ఈదురుగాలులు, పిడుగులు పడే సంభావ్యత ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.