|
|
by Suryaa Desk | Sun, May 04, 2025, 03:34 PM
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విశాఖపట్నంలో జన్మించిన జస్టిస్ గిరిజా NBM లా కాలేజీలో న్యాయశాస్త్రంలో పట్టా, 'లేబర్ అండ్ ఇండస్ట్రీ లా కాలేజీలో మాస్టర్స్, 3 విభాగాల్లో PG పూర్తి చేశారు. 2008-2021 మధ్య అనేక జిల్లా కోర్టులకు జడ్జిగా న్యాయసేవలు అందించారు. 2022లో TG హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు