|
|
by Suryaa Desk | Sun, May 04, 2025, 04:21 PM
తెలంగాణలో కరోనా వంటి ఆర్థిక సంక్షోభ కాలం సహా ఏనాడూ గత BRS ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఆపలేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి ఏటా సగటున రూ. 2 వేల కోట్లు, తొమ్మిదిన్నరేళ్ల BRS పాలనలో మొత్తం రూ. 19,000 కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసామని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 17 నెలల్లో 17 పైసలు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద విడుదల చేయలేదన్నారు.