|
|
by Suryaa Desk | Sun, May 04, 2025, 06:47 PM
హైదరాబాద్: హైదరాబాద్‌లో మే 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా స్పెషల్ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. రాణిగంజ్‌లోని బుద్ధభవన్ సమీపంలో ఉన్న ఓ భవనంలోని రెండు అంతస్తుల్లో ఈ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కానుంది.
ప్రభుత్వ ఆస్తుల రక్షణలో భాగంగా, భూముల కబ్జాలు, ఆక్రమణలను నిర్ధారించిన హైడ్రా, కూల్చివేతలు చేపట్టింది. ఈ క్రమంలో బాధ్యులైన వారిపై అమీన్‌పూర్, శేరిలింగంపల్లి తదితర పోలీస్ స్టేషన్‌లలో నమోదైన 48 కేసులను హైడ్రా స్పెషల్ PSకు బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.