|
|
by Suryaa Desk | Sun, May 04, 2025, 06:52 PM
నల్గొండ జిల్లా కేంద్రంలో మమత హైస్కూల్లో ఆదివారం 2000-01 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. మమత హైస్కూల్లో పదోతరగతి వరకు చదివిన విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత ఒకచోట కలుసుకొని ఒకరికి ఒకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
చదివిన పరిసరాలను చూసి భావోద్వేగానికి గురయ్యారు. నాడు గురువులు నేర్పిన క్రమశిక్షణ, చదువుతో ఈరోజు వివిధ స్థాయిలో ఉన్నారు.