|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 12:26 PM
బీర్కూర్, సోమవారం: రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు బీర్కూర్ ఏఈఓ మీనా తెలిపారు. సోమవారం నుంచి ఈ నెల 31 వరకు ఫార్మ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆమె వెల్లడించారు.
రైతులు తమ ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో వ్యవసాయ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని ఆమె సూచించారు. రిజిస్ట్రేషన్ అనంతరం 11 అంకెలతో కూడిన గుర్తింపు కార్డు జారీ అవుతుందని ఆమె పేర్కొన్నారు.