|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 12:24 PM
కామారెడ్డి జిల్లాలో వేసవి తాపం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సోమవారం కలెక్టరేట్‌లో విడుదల చేసిన ఉష్ణోగ్రతల వివరాల ప్రకారం, ఆదివారం ఉదయం 8:30 నుంచి సోమవారం ఉదయం 8:30 వరకు జిల్లాలోని వివిధ మండలాల్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
బిచ్కుంద మండలంలో అత్యధికంగా 42.1 డిగ్రీలు, మద్నూర్‌లో 41.9 డిగ్రీలు, జుక్కల్‌లో 40.2 డిగ్రీలు నమోదు కాగా, జిల్లాలోని ఇతర మండలాల్లో 36 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అయితే, పాల్వంచ మండలంలోని ఇసాయిపేటలో అత్యల్పంగా 36.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తీవ్రమైన ఎండల కారణంగా ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.