|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 12:09 PM
ఈ నెల 15వ తేదీ నుండి జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, జూన్ 9వ తేదీన హైదరాబాద్‌లో 50 వేల మంది ఉద్యోగులతో మహాధర్నా చేయనున్నట్టు ప్రకటించిన ఉద్యోగ జేఏసీ సంఘాలు . 16 నెలలు వేచి చూసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మె సైరన్ మోగించక తప్పదు అంటున్న ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు . ఇప్పటికే చాలాసార్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, పరిష్కారం లేకపోగా కనీసం చర్చలు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు. పెండింగ్‌లో ఉన్న రూ.9 వేల కోట్ల బిల్లులు వెంటనే క్లియర్ చేయాలని, పీఆర్సీ అమలు చేయాలని, పాత పెన్షన్ పద్ధతిని అమలు చేయాలని, ఇలాంటి అనేక తీర్మానాలను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ . వర్క్ టు రూల్, పెన్ డౌన్, సామూహిక సెలవుల పేరుతో ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధం అవుతున్న ప్రభుత్వ ఉద్యోగులు