|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 12:36 PM
విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా టీ. వి. సత్యం ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని సంఘం నిర్వాహకులు సోమవారం అంతర్జాల సమూహ వేదిక ద్వారా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. జగిత్యాల జిల్లాలోని 18 మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారుల సమ్మతితో ఏకగ్రీవ తీర్మానం ద్వారా టీ. వి. సత్యం ఎన్నికైనట్లు వారు పేర్కొన్నారు.
ఇది టీ. వి. సత్యం మూడవసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం విశేషం. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాభినందనలు తెలిపారు.