|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 12:41 PM
పెనుబల్లి మండలంలోని గట్టుగూడెం గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం, ముత్యాలమ్మ గుడి, బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమాలను ఆదివారం వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దోమా ఆనంద్ బాబు, కాంగ్రెస్ అధ్యక్షుడు పంది వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.