|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 12:42 PM
జన్నారం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షులు జాడి గంగాధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కళ్లాల్లో నిల్వ ఉన్న వడ్లను సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు పంటలు నానే పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. దీనివల్ల రైతులు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
వెంటనే పంటల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని జాడి గంగాధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే రైతుల నష్టాలు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించారు.