|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 02:48 PM
సన్నవడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు. ఐకెపి సెంటర్లు తెరిచి నెలరోజులు గడిచినా ఇప్పటికీ ప్రభుత్వం సన్నవడ్లు కొనుగోలు చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అలాగే సన్నవడ్లకి రూ. 500ల బోనస్ ఇస్తామని రైతులను మోసం చేశారన్నారు. అలాగే అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.