|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 02:50 PM
పుష్ప-2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్, ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏషియన్ ట్రాన్స్‌కేర్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు.
ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అతడిని నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు ఆదివారం పరామర్శించారు. వారు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అతడు పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పట్టవచ్చనే విషయమై కూడా చర్చించారు.